కొండ బిట్రగుంట బ్రహ్మోత్సవాల్లో ఘనంగా గరుడ సేవ మహోత్సవం

కొండ బిట్రగుంట బ్రహ్మోత్సవాల్లో ఘనంగా గరుడ సేవ మహోత్సవం

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బోగోలు మండలం, కొండ బిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం భి ల కూ ట కురుక్షేత్రం నందు ఈనెల 13-3-22 నుండి 19-3-22 వరకు జరుగు బ్రహ్మోత్సవ కార్యక్రమంలో భాగంగా నాలుగో రోజు ఉదయం వేద పండితులచే వేదమంత్రాల తో శాస్త్రయుక్తంగా యాగ శాల యందు నిత్య హోమం, బలిహరణ ,మోహిని ఉత్సవం, రాత్రి గరుడ సేవ గ్రామోత్సవం, గరుడ వాహనంపై ప్రసన్న వెంకటేశ్వర స్వామి భక్తులకు, గ్రామ ప్రజలకు దర్శనమిచ్చారు, ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ శ్రీరాం మాల్యాద్రి, AM C
చైర్మన్ సుకుమార్ రెడ్డి , కార్యనిర్వాహణాధికారి రాధాకృష్ణ, వేద పండితులు శ్రీ అగ్నిహోత్ర వంశీకృష్ణ ఆచార్యులు, వేదగిరి సత్య నారాయణ చార్యులు అర్చకులు ఉభ య కర్తలు భక్తులు పాల్గొన్నారని ఆలయం కార్యనిర్వాహకులు రాధాకృష్ణ తెలిపారు

Kavali SPSR Nellore